
చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరతా..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ తెలుగుదేశం తన సొంత పార్టీ అని, అవసరం అయితే రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ చేరతానని తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయలని చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని బైరెడ్డి చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు.
కాగా గతంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి...మరోచోట గత్యంతరం లేని ఎమ్మెల్యేలు, నాయకులే టీడీపీలో చేరుతున్నారని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే విభజనవాదులో... అలాంటి నేతలందరూ ఒక్కచోటికి చేరిపోతున్నారని ఆయన విమర్శలు చేశారు.