గవర్నర్తో 'ఆ నలుగురు' భేటీ | botsa satyanarayana, raghuveera, kanna, anam meets governor narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో 'ఆ నలుగురు' భేటీ

Feb 20 2014 12:50 PM | Updated on Mar 18 2019 9:02 PM

గవర్నర్తో 'ఆ నలుగురు' భేటీ - Sakshi

గవర్నర్తో 'ఆ నలుగురు' భేటీ

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరారెడ్డి తదితరులు గురువారం భేటీ అయ్యారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై  నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో గురువారం బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరారెడ్డి  భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రాష్ట్ర శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకూ రాష్ట్రపతి పాలన విధించేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందే వరకూ ఈ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,  ఆనం రామనారాయణరెడ్డి,  కన్నా లక్ష్మీనారాయణ, ఎన్.రఘువీరారెడ్డి కూడా సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు.

సీమాంధ్రలో పూర్తిగా బలహీనమైన కాంగ్రెస్‌ను కొంతవరకైనా గాడిలో పెట్టాలంటే పాలనా పగ్గాలు చేతుల్లో ఉంటేనే మేలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి పాలన పెడితే మాత్రం పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని, ప్రజల్లోకి కూడా వెళ్లలేమని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్తో ఈ నలుగురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 మరోవైపు కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో  రాష్ట్రపతి పాలన విధించాలా? విధిస్తే కొత్త చిక్కులేమైనా వస్తాయా అని కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.  సాయంత్రం మరోసారి కేంద్ర కేబినెట్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది.  మరో వైపు రాష్ట్రంలో  రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ గవర్నర్‌ పంపిన నివేదిక కేంద్రానికి చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement