‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’ | bojjala gopalakrishna reddy withdraw his resignation | Sakshi
Sakshi News home page

‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’

Apr 15 2017 1:14 PM | Updated on Apr 3 2019 5:55 PM

‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’ - Sakshi

‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’

మంత్రివర్గం నుంచి తొలగించడంతో అలకబూనిన మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాపై వెనక్కి తగ్గారు.

తిరుపతి: మంత్రివర్గం నుంచి తొలగించడంతో అలకబూనిన మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి ఎట్టకేలకు  తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. బొజ్జల ఈరోజు ఉదయం కాళహస్తిలో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారితో చర్చల అనంతరం టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటన చేశారు.

ప్రాణం ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేతలు వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జలతో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోయిన విషయం తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement