'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి' | bjp leader vishnu vardhan reddy slams tdp mp siva prasad over protests | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి'

Nov 23 2016 3:48 PM | Updated on Mar 29 2019 6:00 PM

'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి' - Sakshi

'టీడీపీ ఎంపీ పగటివేషాలు మానుకోవాలి'

ఎంపీ శివప్రసాద్ పగటి వేషాలు మానుకోవాలని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ శివప్రసాద్ పగటి వేషాలు మానుకోవాలని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నోట్ల రద్దుపై ఎంపీ శివప్రసాద్ నిరసన తెలపడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని... దొంగలకు మద్దతు పలుకుతారా అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు బ్యాంకులు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. కేంద్రంపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, స్వపక్షం అయినా విపక్షం అయినా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. నోట్ల రద్దు విషయంలో కమ్యునిస్టుల వైఖరి స్పష్టంగా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నల్ల డబ్బు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజకీయ పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చారని విష్ణువర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ రైతు మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement