తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పిఠాపురం సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి బీరువాలో దాచిన రూ.51 వేల నగదు, 22 కాసుల బంగారు నగలు దోచుకెళ్లారు.
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. పిఠాపురం సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి బీరువాలో దాచిన రూ.51 వేల నగదు, 22 కాసుల బంగారు నగలు దోచుకెళ్లారు. బాధితులు సోమవారం ఉదయం స్ధానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.