బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ రద్దు! | Beach Love Festival canceled! | Sakshi
Sakshi News home page

బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ రద్దు!

Dec 29 2016 4:16 AM | Updated on Sep 4 2017 11:49 PM

బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ రద్దు!

బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ రద్దు!

తీవ్ర వివాదం రేపిన వైజాగ్ బీచ్‌ లవ్‌ ఫెస్టివల్ను రద్దు చేస్తున్నట్లు మంత్రి గంటా వెల్లడించారు.

ప్రకటించిన మంత్రి గంటా

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వివాదం రేపిన బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ ఎట్టకేలకు రద్దయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం ఉబలాట పడిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారాన్ని నవంబరు 3న ‘బాబు సర్కారు సమర్పించు బీచ్‌ లవ్‌’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచిక ప్రచురించిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. (చదవండి : బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్ )

ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ జరగదని, రద్దయిందని బుధవారం విశాఖలో  విలేకరులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ జరుగుతుందని మంత్రి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement