బ్యాటరీలు, ఆటో ఇంజన్లను చోరీ చేస్తున్నదొంగల అరెస్ట్ | Batteries, auto engines to the scene of the crime was arrested | Sakshi
Sakshi News home page

బ్యాటరీలు, ఆటో ఇంజన్లను చోరీ చేస్తున్నదొంగల అరెస్ట్

Sep 11 2013 4:07 AM | Updated on Aug 20 2018 4:44 PM

బ్యాటరీలు, ఆటో ఇంజన్లను చోరీ చేస్తున్న వ్యక్తులను పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం

పాల్వంచ, న్యూస్‌లైన్: బ్యాటరీలు, ఆటో ఇంజన్లను చోరీ చేస్తున్న వ్యక్తులను పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టుకున్న దొంగలను, బ్యాటరీలను చూపారు. సీఐ రమేష్ మాట్లాడుతూ కొత్తగూడెం మండలం సుజాతనగర్ కు చెందిన మాగంటి రజినీకాంత్, పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన ఎస్‌కె.మెయినుద్దీన్‌లు కలిసి కొంత కాలంగా పాల్వంచతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్నారని తెలిపారు. మంగళవారం స్థానిక దమ్మపేట సెంటర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చిందని సీఐ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement