'కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు' | Bandaru satyanandarao comments on congress mlas | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు'

Jan 6 2014 10:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

'కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు' - Sakshi

'కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు'

రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ అసెంబ్లీ లాబీలో విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇతర పార్టీల వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టినా గెలిచే పరిస్థితులు లేవని బండారు అన్నారు. సీమాంధ్రలో కిరణ్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదన్నారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement