ట్రెజరీ, ఫైనాన్స్ శాఖల ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం | Sakshi
Sakshi News home page

ట్రెజరీ, ఫైనాన్స్ శాఖల ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం

Published Sat, Aug 17 2013 8:01 PM

Ban on Treasury & Finance Departments Strike

హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. వారి సమ్మెను దెబ్బతీసేందుకు  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్మా(ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) ప్రయోగించింది. ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెపై నిషేధం విధిస్తూ 238 జిఓ జారీ చేసింది.

రాష్ట్రాన్ని విభజించవద్దని ఈ నెల 13 నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నో వర్క్‌ నో పే అమల్లోకి తెస్తూ ఈ ఉదయమే 177 జిఓను జారీ చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement