సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న చంద్రబాబు | babu to celebrate sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న చంద్రబాబు

Jan 10 2015 5:15 PM | Updated on Jul 6 2018 3:36 PM

ఈ నెల 13న రాష్ట్రంలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.

హైదరాబాద్: ఈ నెల 13న రాష్ట్రంలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 12న సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారన్నారు. అనంతరం రాష్ట్రంలో జరగబోయే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకలకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరవుతారన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో మంత్రి పర్యటిస్తారన్నారు. అనంతరం చంద్రబాబు ఈశ్వరన్తో కలిసి తుళ్ళూరులో ఏరియల్ సర్వే నిర్వహిస్తారన్నారు. సంక్రాంతి సందర్భంగా కోటి 31 లక్షల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకగా ఆరు రకాల సరుకులు అందిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement