చల్లగా ఉందాం..

Awareness on Sun Stroke And Summer Drinks - Sakshi

పెరుగుతున్న ఎండలు

కాయలు, పండ్లలో పోషక విలువలు అధికం

రసాలతోనూ ఉపశమనం

చిత్తూరు :ఎండలు భగభగమంటున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతలు అధికం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలోని నీటి నిల్వలు, ఖనిజ లవణాల శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల పండ్లు, కాయలు, రసాలు తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందే అవకాశముంటుందని చెబుతున్నారు.   

కొబ్బరిబొండం
కొబ్బరి నీళ్లు తాగితే తాపం తగ్గుతుంది. శరీరం  డీ హైడ్రేషన్‌ కు గురికాకుండా నిలువరిస్తుంది. కొబ్బరిబొండంలో కాల్షియం, పాస్పరస్, విటమిన్‌ బీ1, బీ3, సీ మొండుగా లభిస్తాయి.

ఇవీ పోషకాలు
నీరు–93.08 శాతం, శక్తి–24 కిలో కేలరీలు, కాల్షియం–25 మిల్లీగ్రాములు, పాస్పరస్‌– 10 మిల్లిగ్రాములు, విటమిన్‌ బీ1–0.01 మిల్లీగ్రాములు, విటమిన్‌ బీ3– 0.1మిల్లీ గ్రాము, విటమిన్‌ సీ–2 మిల్లీగ్రాములు ఉంటాయి.

దోసకాయ
వేసవిలో దోసకాయ తింటే ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తింటే 13 కిలోకేలరీల శక్తి ఉత్పన్నమై శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాల్షియం, పాస్పరస్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్‌ సీ, బీ, డీ అలసట దూరమవుతుంది.

ఇవీ పోషకాలు
నీరు–96.9శాతం, శక్తి–13 కిలో కేలరీలు, కాల్షియం–10 మిల్లీగ్రాములు, పాస్పరస్‌– 25 మిల్లీగ్రాములు, పోలిక్‌యాసిడ్‌–14.7 మిల్లీగ్రాములు, విటమిన్‌ సీ–17 మిల్లీగ్రాములు, విటమిన్‌ బీ–0.2 మిల్లీగ్రాములు, విటమిన్‌ డీ–0.3 మిల్లీ గ్రాములు ఉంటాయి.

పుచ్చకాయ
పుచ్చకాయలో నీటితో పాటు పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.  జ్యూస్‌ తాగినా, నేరుగా తిన్నా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. విటమిన్‌ బీ6 ఎనర్జీ లభిస్తుంది.

ఇవీ పోషకాలు
నీరు–92శాతం, విటమిన్‌ బీ–6 మిల్లీ గ్రాములు, పిండి పదార్థం–7 శాతం, శక్తి–16 కిలో కేలరీలు ఉంటాయి.

ద్రాక్ష
దాక్ష పండు తిన్నా,  రసం తాగినా శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. అన్ని పండ్ల కన్నా ద్రాక్షలో కేలరీలు బాగా లభిస్తాయి. నీరు, ప్రొటీన్లు, కొవ్వు, పీచుపదార్థాలు, ఐరన్‌ మెండుగా ఉంటాయి.

ఇవీ పోషకాలు
  నీరు–92.2 శాతం, ప్రొటీన్లు–0.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు– 0.3 గ్రాములు, పీచు పదార్థాలు– 2.9 గ్రాములు, ఐరన్‌ శక్తి–0.52 మిల్లీ గ్రాములు, శక్తి– 71 కిలో కేలరీలు లభిస్తాయి.

అరటి పండు
అరటి పండు సులభంగా జీర్ణమై రక్తంలో కలుస్తుంది.  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ తగ్గించి అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. మినరల్స్, పొటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఈపండులో 70.1గ్రాముల నీరు ఉంటుంది. ప్రొటీన్లు 1.2 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, పిండిపదార్థాలు 27.2 గ్రాములు ఉంటాయి.

మామిడి పండు
మామిడి పండులో కార్బన్‌ కణాలను అరికట్టే గొప్ప గుణం ఉంది. ఇందులో ఉండే ఫాలీఫినోల్‌ ఇందుకు సహకరిస్తుంది. 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృతులు, ఏ,బీ, సీ విటమిన్లు ఉంటాయి. పిండిపదార్థాలు 17.00 గ్రాములు, చక్కెర 14.8 గ్రాములు, పీచు పదార్థాలు 0.27, మాంసకృత్తులు 51 గ్రాములు, థయామిన్‌ 0.058, సియాసిస్‌ 0.0584 లు ఉంటాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top