ఆసెట్ ఫలితాలు విడుదల | AUCET Results Released | Sakshi
Sakshi News home page

ఆసెట్ ఫలితాలు విడుదల

May 30 2014 12:23 AM | Updated on Sep 2 2017 8:02 AM

ఆసెట్ ఫలితాలను ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజనీరింగ్ ఏయూ ఈఈటీ 2014 కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షల విధానాన్ని సరళం చేశామన్నారు.

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి, పరీక్షలను కుదించి తొమ్మిది విభాగాలుగా మాత్రమే నిర్వహించామని చెప్పారు. జూన్ 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. ర్యాంక్ కార్డులు, కౌన్సెలింగ్ విధానం, తేదీలు తదితర వివరాలను www.andnrauniversity.edu.in, www.audoa.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.

Advertisement

పోల్

Advertisement