బస్సుయాత్రలు చేపడితే రాళ్లతో కొడతారు

attack on ysrcp bus yatra - Sakshi

ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం 

ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం 

ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటు కోసమే ప్రజా సంకల్ప యాత్ర 

ఐదో రోజుకు చేరిన రిలే నిరహార దీక్షలు 

ఆలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే కావాలంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ బస్సుయాత్రలు చేపడితే ప్రజలు రాళ్లతో దాడి చేయడం తప్పదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండు ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార నిదీక్షలు బుధవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి, బంకా రామాంజనేయులు, నాగభూషణం, హరేరాం, కంది గాదిలింగ, తిక్కన్న, కిష్టప్ప, వెంకటేశు దీక్షలో కూర్చున్నారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను అమలు చేసి, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనంకి జనార్ధన్‌ నాయుడు, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు విక్రాంత్‌ రెడ్డి, ఆలూరు, హాలహర్వి, హొళగుంద, మండలాల కన్వీనర్లు చిన్న ఈరన్న, షఫివుల్లా, భీమప్ప చౌదరి, హాలహర్వి ఎంపీపీ బసప్ప, ఎంపీటీసీలు లక్ష్మన్న, నాగేంద్ర, నాగరాజు, చౌడమ్మ, సుమతి, నాయకులు అరికెర వీరేశ్, అరికెర వెంకటేశ్, శివ, తిక్కన్న, గోవిందు, సోమేశ్వర్‌రెడ్డి, హనుమయ్య, ప్రభాకర్‌నాయుడు, దేవనకొండ నారాయణరెడ్డి, కిట్టు 
తదితరులు పాల్గొన్నారు. 
 బీసీ, ఎస్సీ, ప్రజా సంఘాల మద్దతు.. 
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏపీ బీసీ సంఘం నాయకులు లోకేశ్, లింగన్న, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రచార కార్యదర్శి గాదిలింగ, రామాంజనేయులు, మారెప్ప, బాబు, రాయలసీమ దళిత సమాఖ్య నియోజకవర్గ అధ్యక్షుడు బూర్లకృష్ణ, సీపీఎం నియోజకవర్గ కమిటీ కన్వీనర్‌ నారాయణస్వామి, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు షాకీర్, మైనా తదితరులు మద్దతు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top