కర్నాటకలో ‘ఆపరేషన్‌రెడ్’..! | attack on redwood reserves | Sakshi
Sakshi News home page

కర్నాటకలో ‘ఆపరేషన్‌రెడ్’..!

Mar 10 2016 1:05 AM | Updated on Sep 3 2017 7:21 PM

కర్నాటకలో ‘ఆపరేషన్‌రెడ్’..!

కర్నాటకలో ‘ఆపరేషన్‌రెడ్’..!

ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు కర్నాటకలోని ఎర్ర చందనం నిల్వలపై దాడులు చేశారు

ఎర్రచందనం నిల్వలపై ముప్పేట దాడి

చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు కర్నాటకలోని ఎర్ర చందనం నిల్వలపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో కటిగనహళ్లికు చెందిన ఇర్ఫాన్‌ఖాన్ (22), సయ్యద్ ముబారక్ (22) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి పోలీసులు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బెంగళూరు సమీపంలోని గిడ్డప్పన్‌హళ్లిలోని ఫాసీ అనే వ్యక్తికి చెందిన గోదాములో 6 టన్నుల దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ప్రధాన స్మగర్లకు సహాయకులుగా ఉన్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement