ఓ నగల వ్యాపారికి తన దగ్గర పనిచేసే గుమాస్తా టోకరా వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
హైదరాబాద్: ఓ నగల వ్యాపారికి తన దగ్గర పనిచేసే గుమాస్తా టోకరా వేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కు చెందిన రాజేందర్ జైన్ అనే నగల వ్యాపారి తన కస్టమర్ రూ. 17 లక్షల విలువ చేసే నగలు డెలివరీ చేయాల్సి ఉంది. దీంతో తన దగ్గర పనిచేసే గుమాస్తా చంద్రమౌళికి ఈ పని అప్పగించాడు. ఇదే మంచి సమయం అనుకుని భావించిన చంద్రమౌళి చాకచక్యంగా నగలు కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు.
నగలు తీసుకుని హైదరాబాద్ వచ్చిన గుమస్తా చంద్రమౌళి నగలు పోయాయని యజమానికి ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు..గుమస్తా చంద్రమౌళి నే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 17 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.