
హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ
హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
సైదాబాద్ (హైదరాబాద్) : హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సైదాబాద్ డివిజన్ దోభీఘాట్ సమీపంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు రోడ్లను ఊడ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించారు. నగరం మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.