
ప్రత్యేక ప్రార్థనల్లో రెహమాన్
వెంకటాచలం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శుక్రవారం దర్శించుకున్నారు. కసుమూరు దర్గా గంధోత్సవానికి కొన్నేళ్ల నుంచి ఏఆర్ రెహమాన్ వస్తున్నారు. అందులోభాగంగా ఇక్కడకు వచ్చిన రెహమాన్‌కు తొలుత దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. ఆయనకు పూలమాల వేసి, శాలువా కప్పి సత్కరించారు.