కేంద్ర మంత్రుల ఓటమే మా లక్ష్యం: ఏపీఎన్జీవో నేతలు
సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర మంత్రులను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఎన్జీవో నేతలు హెచ్చరించారు. కేంద్ర మంత్రులను రాజకీయంగా సమాధి చేస్తామని, వారికంటే తమ స్థాయే పెద్దదని తెలిపారు.
అసెంబ్లీకి బిల్లు వచ్చే సమయంలో చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తామని, అలాగే పార్లమెంట్‌లో బిల్లు వచ్చే సమయంలో చలో పార్లమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. సమ్మెతో పాటు అన్ని అంశాలపై ఈ నెల 24న కీలక సమావేశం నిర్వహిస్తామని, అందులో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తోడ్పడతాయని భావిస్తున్నట్లు ఏపీఎన్జీవో నేతలు చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి