పరిశ్రమ మళ్లీ తెరుస్తున్నారా? జర భద్రం!

AP Officials Issued Guidelines On Restarting Industries After Lockdown Exemptions - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ తర్వాత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. నెలల తరబడి యంత్రాలను ఉపయోగించకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే వీలుందని అధికారులు చెబుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలను పునఃప్రారంభించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను విద్యుత్‌ భద్రతా సంచాలకులు, ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి గంధం విజయలక్ష్మి సోమవారం పేర్కొన్నారు. 

ఇలా చేయాలి 
► విద్యుత్‌ పరికరాలను ఉపయోగించే ముందు అనుభవం ఉన్న ఇంజనీర్లు, విద్యుత్‌ సేఫ్టీ ఆఫీసర్‌ చేత తనిఖీ చేయించాలి. 
► సబ్‌ స్టేషన్లలో హెచ్‌టీ ఇన్సులేటర్లు, బుషింగ్స్‌ మీద తేమ, ధూళిని సిలికాన్‌ గ్రీజ్‌తో శుభ్రం చేయాలి.  
► ఏబీ స్విచ్, ఐసోలేటర్లు, హెచ్‌టీ బ్రేకర్స్, కాంటాక్టు క్లోజ్‌ చేసి, పె ట్రోలియం జెల్లీపూసి ఆపరేషన్‌ ఫ్రీగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. 
► విద్యుత్‌ లైన్‌లో లైటనింగ్‌ అరెస్టులు (పిడుగు వాహకాలు) పరీక్షించి, వాటి ఎర్త్‌ కనెక్షన్‌ పరిశీలించి, ట్రాన్స్‌ఫార్మర్‌ బ్రేకర్స్‌ను 
రక్షించేందుకు లైన్‌కు కలిపి ఉంచాలి. 
► ట్రాన్స్‌ఫార్మర్‌లో సిలికాజల్, ఆయిల్‌ లెవల్‌ చెక్‌ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మర్‌ వైండింగ్‌ ఇన్సులేషన్‌ రెసిస్టెన్స్‌ అంటే హెచ్‌వీ నుంచి యల్‌వీ, ఎర్త్‌లకు మెగ్గర్‌తో తనిఖీ చేయాలి.  
► మెయిన్‌ ప్యానల్స్, సబ్‌ ప్యానల్స్, హెచ్‌టీ బ్రేకర్స్‌లను ఎయిర్‌ బ్లోయర్‌తో శుభ్రపరచి, కేబుల్‌ టెర్మినల్‌ కనెక్షన్‌ను పరిశీలించాలి. 
► హెచ్‌టీ, ఎల్‌టీ సర్క్యూట్‌ బ్రేకర్స్‌ మాన్యువల్‌గా ట్రిప్‌ చేసి కాంటాక్టు చెక్‌చేసుకోవాలి.  
► విద్యుత్‌ లైటింగ్‌ సర్క్యూట్‌లో ప్రమాణాల ప్రకారం 30, 100 ఎంఏ...ఆర్‌సీసీబీలను డ్రిస్టిబ్యూషన్‌ బోర్డులలో అమర్చి, ఎలక్ట్రికల్‌ షాట్‌ సర్క్యూట్‌ నుంచి రక్షిస్తూ విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా చూడాలి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top