ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు | ap govt to take telugu nris suggestions for state development | Sakshi
Sakshi News home page

ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు

Sep 10 2015 9:16 AM | Updated on Sep 3 2017 9:08 AM

రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం న్యూజెర్సీలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. రాజధాని నగరమైన అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రఅభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement