బోటు ప్రమాదంపై విచారణ కమిటీ ఏర్పాటు

AP Govt Set up Special Enquiry Committee on Boat capsizes Incident - Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో రెవెన్యూ చీఫ్‌ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ సభ్యులుగా ఉంటారు. బోటు ప్రమాదంపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీని ఆదేశించారు. 45 రోజుల్లో లాంచీ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునిగిపోయి పలువురు ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top