‘పెనుగొండ’ ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ | AP Govt sends EX Gratia to Penukonda Victims | Sakshi
Sakshi News home page

‘పెనుగొండ’ ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

Feb 18 2015 7:38 PM | Updated on Jun 2 2018 2:36 PM

బస్సు లోయలో పడి 16 మంది విద్యార్థులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పరిహారాన్ని అందించింది.

పెనుగొండ(అనంతపురం): బస్సు లోయలో పడి 16 మంది విద్యార్థులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పరిహారాన్ని అందించింది. ఈ ఏడాది జనవరి 7న అనంతపురం జిల్లా పెనుగొండ-మడకశిర మధ్య రోడ్డు నిర్మాణ పనుల కోసం తవ్విన లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 16 మంది విద్యార్థులు మృతి చెందగా చాలా మంది విద్యార్థులు గాయపడిన విషయం విదితమే.


కాగా, బాధితులకు పరిహారం అందిస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం పెనుగొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 90 బాధిత కుటుంబాలకు రూ.1.59 కోట్ల పరిహారాన్ని మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే పార్థసారధి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement