వ్యవసాయ రంగం : ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

AP Government Want To Take Key Actions to Agriculture With Agreement Of Institutions - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞాన మార్పిడి, శిక్షణ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో పలు జాతీయ సంస్థలతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందాలను చేసుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయా సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకోనుంది. ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనుంది.

చెన్నైలోని ఎంఎస్‌ స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో పాటు.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్-న్యూఢిల్లీ, సాయిల్‌ సైన్స్‌ డివిజన్-న్యూఢిల్లీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్-హైదరాబాద్‌, సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్‌, శిక్షణ సంస్థ-ఫరీదాబాద్‌, నేషనల్‌ సీడ్‌ రీసెర్చ్‌, శిక్షణ సంస్థ-వారణాశి, సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్-హైదరాబాద్‌, నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌-కర్నాల్‌, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్-ఉత్తర్‌ప్రదేశ్‌,  బెంగుళూరుకు చెందిన సదరన్‌ రీజనల్‌ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్‌ సీఐఎఫ్‌ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకోనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top