
సాక్షి, శ్రీకాకుళం : తుపాను ధాటికి సర్వం కోల్పొయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను చంద్రబాబు సర్కార్ వేధింపులకు గురిచేస్తోంది. సీఎం పర్యటనలో తమకు సాయం అందలేదని చెప్పినందుకు కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. కొత్తూరు మండలం చినవంకలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎంకు తమ గోడును విన్నవించుకున్నారు. తమకు నీళ్లు, ఆహారం అందడంలేదని సీఎంకు సమాధానం చెప్పారు. దీంతో అధికారులు వారిని ఇబ్బందులకు గురుచేస్తున్నారు. సాయం అందలేదని చెప్పినందుకు అధికారులు తమన వేధిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వమని కోరినందుకు ముగ్గురు బాధితులపై అక్రమ కేసులు పెట్టి రాత్రంతా జైల్లో పెట్టి వేధించారన్నారు. సహాయం అందడంలేదని చెబితే బెదిరిస్తున్నారని తుపాను బాధితులు వాపోతున్నారు.