ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు | AP Cabinet Approves Pension Scheme and Key Decisions | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

Jun 10 2019 2:01 PM | Updated on Jun 10 2019 3:14 PM

AP Cabinet Approves Pension Scheme and Key Decisions - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఆశా వర్కర్ల జీతాలు రూ.3వేలు నుంచి రూ.10వేలకు పెంపుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ పెంపుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త‍్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గంలో చర్చ కొనసాగుతోంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన మంత్రివర‍్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది.

చదవండి: కొనసాగుతున‍్న ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement