అర్థరాత్రి వరకూ ఢిల్లీ చేరుకుంటారు: ప్రవీణ్‌ ప్రకాశ్‌

AP Bhavan Officials Arrange Buses For Telugu Students AT Srinagar NIT - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని తెలుగు విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఏపీ భవన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్ మాట్లాడుతూ‌.. కశ్మీర్‌ లోయలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దాంతో ఎన్‌ఐటీ, కాలేజీ విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయిందని తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు అర్థరాత్రి వరకు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top