టీడీపీ నేత తోటలో వన‍్య ప్రాణుల మాంసం విక్రయం | animal Meat cought in tdp leaders farm | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత తోటలో వన‍్య ప్రాణుల మాంసం విక్రయం

Jul 2 2017 10:57 AM | Updated on Aug 10 2018 8:26 PM

టీడీపీ నేత తోటలో వన‍్య ప్రాణుల మాంసం విక్రయం - Sakshi

టీడీపీ నేత తోటలో వన‍్య ప్రాణుల మాంసం విక్రయం

తెలుగుదేశం పార్టీ నేతకు సంబంధించిన 30 ఎకరాల మామిడి తోటలో వన‍్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారు.

మదనపల్లి (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ‍్యక్షడు, నిమ్మనపల్లి మండలం ఆచర్లపల్లికి చెందిన ఆర్‌జే వెంకటేష్‌కు సంబంధించిన 30 ఎకరాల మామిడి తోటలో వన‍్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక‍్కడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు ఆదివారం ఉదయం మామిడి తోటను పరిశీలించారు.

సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడి వాటిని తోటలో వధించి వాటి మాంసం తెచ్చి పట‍్టణంలో విక్రయిస్తున‍్నట్లు బయటపడింది. తోటలో పెద‍్దఎత్తున అడవి పందుల మాంసం బయటపడింది. ఈ తంతు ఎన‍్నో రోజులుగా కొనసాగుతోంది. ముందస్తు సమాచారంతో ఆదివారం ఆకస్మికంగా దాడి నిర‍్వహించారు. ఈ సందర‍్భంగా నిందితులు పరారయ్యారు. పలు ద్విచక్రవాహనాలు పట్టుపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement