'ఇది బాబు మార్కు రాజకీయం' | andrapradesh assembly sessoins | Sakshi
Sakshi News home page

'ఇది బాబు మార్కు రాజకీయం'

Mar 19 2015 9:50 AM | Updated on Aug 18 2018 5:15 PM

శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు బాబు మార్కు రాజకీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి అన్నారు.

విజయవాడ : శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు బాబు మార్కు రాజకీయమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా వీధి రౌడీలా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపారన్నారు. ముఖ్యమంత్రి ప్రవర్తన చూస్తుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలా దిగజారుతున్నారని అర్ధమవుతోందని చెప్పారు.

ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు తనవద్ద సమాధానం లేకపోవడంతో చంద్రబాబు తన ఎమ్మెల్యేలను పథకం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణలకు ఉసి గొలుపుతున్నారని చెప్పారు. వీధిరౌడీలను గుర్తించి వారికి టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేయడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, ఇది రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.
(సత్యనారాయణపురం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement