ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల వింత పోకడ విచిత్రంగా ఉంది. వడ్డించేవారు మనవాళ్లు అయితే...అన్న చందంగా మంత్రులు ...
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రుల వింత పోకడ విచిత్రంగా ఉంది. వడ్డించేవారు మనవాళ్లు అయితే...అన్న చందంగా మంత్రులు ... ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఏజెంట్ల నియామకాల కోసం మంత్రల పేషీలో లాబీయింగ్ జోరుగా సాగుతోంది.
సాక్షాత్తు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...నందకుమార్ అనే వ్యక్తిని సిఫార్సు చేశారు. అది కూడా సామాన్య భక్తులకు సేవలు అందించేందుకే ఏజెంట్ల నియామకం అని పేర్కొనటం విశేషం. మంత్రుల సిఫార్సుల పరంపరను చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఉద్యోగుల బదిలీల విషయంలోనూ లాబీయింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లినట్లు సమాచారం.