సీఎం పదవిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కన్నేశారని ఆనం జయకుమార్‌రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ఏకపక్షంగా, నియంతలా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ హడావుడిగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసుంటే రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వెనక్కి తగ్గేదని ఆయన అన్నారు.
సీఎం పదవిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కన్నేశారని ఆనం జయకుమార్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని, ఆనం సోదరులను ప్రజలు క్షమించరని అన్నారు.