ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల | Akkineni Nageshwararao daughter comments on condolence Meeting | Sakshi
Sakshi News home page

ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల

Jan 24 2014 8:28 PM | Updated on May 24 2018 12:20 PM

ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల - Sakshi

ఏఎన్నార్ చనిపోయాక పొగడటం విచారకరం: నాగసుశీల

'మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం' అని అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల వ్యాఖ్యానించారు.

'మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం' అని అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల వ్యాఖ్యానించారు. ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ఏఎన్‌ఆర్ సంతాప సభలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర విభాగాలకు చెందిన టెక్నిషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  పద్మవిభూషణ్ వచ్చినప్పుడు స్పందించని సినీ పరిశ్రమ..మా నాన్న చనిపోయాక పొగడటం విచారకరం అని  నాగసుశీల అన్నారు. 
 
ఇదే సభలో మహానటులకు జరిగిన అన్యాయంపై ఆర్ నారాయణ మూర్తి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ స్వార్థాల వల్ల మహానటులు ఎన్ టీఆర్ కు భారత రత్న రాలేదు అని  ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఏఎన్నాఆర్ కు భారతరత్న ఇచ్చి తీరాలి నారాయణమూర్తి డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement