రగిలిపోతున్న సమైక్యవాదులు, కొనసాగుతున్న బంద్ | Against Telangana Note Bandh Continuous in Seemandhara districts | Sakshi
Sakshi News home page

రగిలిపోతున్న సమైక్యవాదులు, కొనసాగుతున్న బంద్

Oct 4 2013 10:55 AM | Updated on Sep 27 2018 5:56 PM

రగిలిపోతున్న సమైక్యవాదులు, కొనసాగుతున్న బంద్ - Sakshi

రగిలిపోతున్న సమైక్యవాదులు, కొనసాగుతున్న బంద్

రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదించడంపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌కు సీమాంధ్ర జిల్లాల్లో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు కేంద్రం ఆమోదించడంపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌కు సంపూర్ణమద్దతు తెలిపారు. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేశారు. ప్రెట్రోల్‌ బంక్‌లు కూడా మూతపడ్డాయి.  అర్ధరాత్రి నుంచి తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రహదారులను ఆందోళనకారులు మూసివేశారు.

శ్రీకాకుళంలోని కాంగ్రెస్‌ కార్యాలయాన్ని   ధ్వంసం చేశారు. మంత్రి శత్రుచర్ల కార్యాలయానికి సమైక్యవాదులు తాళాలు వేశారు. ఆంధ్రా ఒడిశా జాతీయ రహదారిపై సమైక్యవాదులు బైఠాయించడంతో భారీగా నిలిచిపోయాయి. విశాఖలోని కేజీహెచ్‌ హాస్పటల్‌లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అనంతపురం గుంతకల్లులోని GBC కార్యాలయానికి నిప్పుపెట్టారు.

తిరుమలకు వెళ్ళే ప్రైవేటు వాహనాలను సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. రోడ్లపై టైర్లుకాల్చి నిరసన తెలుపుతున్నారు.  విజయనగరం  బొత్స ఇంటిని ముట్టడించారు. ఆయనకు చెందిన కళాశాలపై దాడిచేశారు. మొత్తం సీమాంధ్రలోని  13 జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా సాగుతోంది.
 

ఆంధ్రప్రదేశ్ను విడగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినేట్ ఆమోదించడంతో - సీమాంధ్రలో ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. విభజన ప్రక్రియకు నిరసనగా - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి - 72గంటల బంద్ కు పిలుపునివ్వడంతో - తిరుపతిలో ఆ పార్టీ నేతలు బంద్ ను నిర్వహిస్తున్నారు.

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు నగరంలో నిరసన జ్యాలలు రగులుతూనే ఉన్నాయి. తెలంగాణ నోట్ ను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసి నేతలు ఇచ్చిన 72 గంటల బంద్ కూడా నిర్విరామంగా కొనసాగుతుంది. వ్యాపారస్థులు, దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు. ఉదయం నుంచి రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా మారాయి.

తెలంగాణా నోట్ పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నోట్ ను నిరసిస్తూ అనంతపురంలో జేఎసి పిలుపు నిచ్చిన 48 గంటల బంద్ కొనసాగుతోంది. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారు. స్వచ్చందంగా షాపులు మూసివేసి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బంద్ ప్రభావంతో అనంతపురం నిర్మానుషుంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యమం కారణాంగా పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 72 గంటల చిత్తూరు జిల్లాలో బంద్ కొసాగుతోంది. ఈక్రమంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తులు ప్రజలు ఎక్కడిక్కడ రహదారులను దిగ్బంధించి తమ నిరసనను తెలుపుతున్నారు. తిరుమలకు వాహనాల రాక పోకలను నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు వేసి మంటపెట్టారు. దాంతో ఎక్కడిక్కడ ట్రాపిక్ స్తంభించిపోయింది.

 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ప్రకాశంజిల్లాలో  ఆందోళనలు కొనసాగుతున్నాయి..వైయస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో  జిల్లాలో బంద్ జరుగుతోంది...వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. హైవేపై ఎన్జీఓలు రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటల సేపు హైవేని దిగ్బంధించారు. సీమాంద్ర ఆందోళనలను కాంగ్రెస్ అధిష్టానం పట్టింకోకపోవడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement