కాకినాడ పట్టణంలోని వెంకటనగర్‌లో ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొంది. లేడీస్ హాస్టల్‌లో తగిన వసతులు లేవంటూ ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థినులు తమ వసతి గృహం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు.
ఆఫ్రికన్ విద్యార్థినుల ఆందోళన
Apr 19 2016 2:58 PM | Updated on Mar 28 2019 6:23 PM
కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా) : కాకినాడ పట్టణంలోని వెంకటనగర్‌లో ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొంది. లేడీస్ హాస్టల్‌లో తగిన వసతులు లేవంటూ ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థినులు తమ వసతి గృహం ముందు మంగళవారం ఆందోళనకు దిగారు.
వారికి మద్దతుగా కొందరు ఆఫ్రికన్ విద్యార్థులు హాస్టల్‌లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారితో చర్చలు మొదలుపెట్టారు. ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఆదిత్య విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్నారు.
Advertisement
Advertisement