'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి' | Actor Rajasekhar, Jeevita meet Telangana Chief Minister | Sakshi
Sakshi News home page

'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయ'

Jun 5 2014 3:11 PM | Updated on Apr 3 2019 9:02 PM

'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి' - Sakshi

'కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయి'

సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు.

హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును కలిశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు వారు అభినందలు తెలిపారు. చిన్న సినిమాలను బతికించాలని కేసీఆర్ ను కోరినట్టు జీవిత రాజశేఖర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. సినిమా పరిశ్రమను కొన్ని కుటుంబాలే శాసిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో జీవిత రాజశేఖర్‌ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఓ స్టార్ హీరో కారణంగా తాను కాంగ్రెస్ పార్టీని వీడినట్టు అంతకుముందు రాజశేఖర్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement