అటవీశాఖలో అవినీతి చేప | ACB traps forest department | Sakshi
Sakshi News home page

అటవీశాఖలో అవినీతి చేప

Jan 23 2014 5:57 AM | Updated on Sep 2 2017 2:55 AM

జిల్లా అటవీ శాఖ పరిధిలోని తల్లాడ రేంజ్ ఈర్లపుడి (ఖమ్మం) డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుండపునేని వెంకట రామకృష్ణ.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. జిల్లా అటవీ శాఖ పరిధిలోని తల్లాడ రేంజ్ ఈర్లపుడి (ఖమ్మం) డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుండపునేని వెంకట రామకృష్ణ.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తల్లాడ అటవీ రేంజ్ పరిధిలోని బిల్లుపాడు (వెంకటగిరి) గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాసరావు ఆ ప్రాంతంలో తయారు చేసిన వెదురు బుట్టలను, ముల్లు కర్రలను ఖమ్మంలోని దుకాణాల్లో అమ్ముతుంటా డు.

 ఇందులో భాగంగా ఈ నెల 4న బిల్లుపాడు నుంచి ఆటోలో వెదురు బుట్టలను, ముల్లుకర్రలతో ఖమ్మం వెళుతుండగా ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి రామకృష్ణ అడ్డగించారు. గతంలో మాదిరిగానే ఎంతోకొంత ఇస్తామని మట్టా శ్రీని వాసరావు ప్రాధేయపడినప్పటికీ డీఆర్‌ఓ అంగీకరించలేదు. జరిమానాతోపాటు తనకు కూడా కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం తాము ఇవ్వలేనని చెప్పడంతో సరుకుతో ఉన్న ఆటోను స్వాధీనపర్చుకుని ఖమ్మంలోని అట వీ శాఖ కార్యాలయానికి తరలించారు.

అప్పటి నుంచి శ్రీనివాసరావు, అతని కుటుంబీకులు కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు జరి మానా కింద రూ.6,100, డీఆర్‌ఓకు 8,900 చొ ప్పున మొత్తం రూ.15వేలు ఇచ్చేందుకు ఒప్పం దం చేసుకున్నారు. ఆ తరువాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి శ్రీనివాసరావు తీసుకెళ్లారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం రాత్రి ఖమ్మం అటవీ శాఖ కార్యాలయంలో రూ.15వేలను డీఆర్‌ఓకు శ్రీనివాసరావు ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 ఆ నగదు స్వాధీనపర్చుకుని డీఆర్‌ఓను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా తమ నుంచి పలుసార్లు వేల రూపాయలు లంచంగా డీఆర్‌ఓ తీసుకున్నాడని, ఈసారి లంచంతోపాటు జరిమానా కూడా వేయడంతో ఏసీబీని ఆశ్రయించామని శ్రీనివాసరావు చెప్పారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్టు తెలిసింది. ఏసీబీకి డీఆర్వో చిక్కిన నేపథ్యంలో అటవీ శాఖలోని మిగి లిన అక్రమార్కులు తమ బండారం ఎప్పుడు, ఎలా బయటపడుతోందని భయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement