breaking news
range of forest department
-
ప్రభుత్వ అధికారుల అక్రమాల పుట్టపగులుతోంది.. తవ్వే కొద్దీ డబ్బే డబ్బు
భువనేశ్వర్: అవినీతికి పాల్పడుతున్న అటవీశాఖ అధికారుల్ని విజిలెన్స్ అధికారులు ఆట కట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అటవీ శాఖ అధికారుల ఇళ్లలో విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ అధికారికి 116 ఫ్లాట్లు గుర్తించగా.. మరో అధికారి ఇంట్లో తవ్వే కొద్దీ నోట్ల కట్టలు, గోల్డ్ కాయిన్లు, ఇతర బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారుల ఇళ్లల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆరో ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నాయక్ నివాసంలో ఆదాయానికి మించిన రూ.1.44 కోట్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.తనిఖీల్లో జయపూర్‌లోని ఆయన ఫ్లాట్‌లో రహస్య గదిలో దాచిన రూ. 1.44 కోట్ల నగదు, 4 బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణేలు (ప్రతి నాణెం 10 గ్రాములు),6 ప్రాంతాల్లోని జయపూర్, భువనేశ్వర్‌లోని ఆయన నివాసాలు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఈ దాడుల్లో ఆరుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, తొమ్మిదిమంది ఏఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కరెన్సీ కౌంటింగ్ మెషీన్లు ఉపయోగించి నగదు లెక్కింపు కొనసాగుతోంది.ఈ దాడికి ముందు మరో అటవీ శాఖ అధికారి నివాసాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సదరు అధికారికి 119కి పైగా ప్లాట్లు ఉన్నట్లు తేలింది. -
అటవీశాఖలో అవినీతి చేప
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. జిల్లా అటవీ శాఖ పరిధిలోని తల్లాడ రేంజ్ ఈర్లపుడి (ఖమ్మం) డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుండపునేని వెంకట రామకృష్ణ.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. తల్లాడ అటవీ రేంజ్ పరిధిలోని బిల్లుపాడు (వెంకటగిరి) గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాసరావు ఆ ప్రాంతంలో తయారు చేసిన వెదురు బుట్టలను, ముల్లు కర్రలను ఖమ్మంలోని దుకాణాల్లో అమ్ముతుంటా డు. ఇందులో భాగంగా ఈ నెల 4న బిల్లుపాడు నుంచి ఆటోలో వెదురు బుట్టలను, ముల్లుకర్రలతో ఖమ్మం వెళుతుండగా ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి రామకృష్ణ అడ్డగించారు. గతంలో మాదిరిగానే ఎంతోకొంత ఇస్తామని మట్టా శ్రీని వాసరావు ప్రాధేయపడినప్పటికీ డీఆర్ఓ అంగీకరించలేదు. జరిమానాతోపాటు తనకు కూడా కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం తాము ఇవ్వలేనని చెప్పడంతో సరుకుతో ఉన్న ఆటోను స్వాధీనపర్చుకుని ఖమ్మంలోని అట వీ శాఖ కార్యాలయానికి తరలించారు. అప్పటి నుంచి శ్రీనివాసరావు, అతని కుటుంబీకులు కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు జరి మానా కింద రూ.6,100, డీఆర్ఓకు 8,900 చొ ప్పున మొత్తం రూ.15వేలు ఇచ్చేందుకు ఒప్పం దం చేసుకున్నారు. ఆ తరువాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి శ్రీనివాసరావు తీసుకెళ్లారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం రాత్రి ఖమ్మం అటవీ శాఖ కార్యాలయంలో రూ.15వేలను డీఆర్ఓకు శ్రీనివాసరావు ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ నగదు స్వాధీనపర్చుకుని డీఆర్ఓను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా తమ నుంచి పలుసార్లు వేల రూపాయలు లంచంగా డీఆర్ఓ తీసుకున్నాడని, ఈసారి లంచంతోపాటు జరిమానా కూడా వేయడంతో ఏసీబీని ఆశ్రయించామని శ్రీనివాసరావు చెప్పారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్టు తెలిసింది. ఏసీబీకి డీఆర్వో చిక్కిన నేపథ్యంలో అటవీ శాఖలోని మిగి లిన అక్రమార్కులు తమ బండారం ఎప్పుడు, ఎలా బయటపడుతోందని భయపడుతున్నారు.