ఏసీబీ వలలో పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ | acb caught municipal corporation regional director | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్

May 12 2015 4:38 PM | Updated on Sep 22 2018 8:22 PM

ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏపీ పురపాలక శాఖ రీజినల్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.

తిరువూరు (కృష్ణా జిల్లా) : ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏపీ పురపాలక శాఖ రీజినల్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... పెడన మునిసిపల్ ఉద్యోగి ఒకరికి గతంలో మెమో జారీ కాగా, దానిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాజేంద్రప్రసాద్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను సంప్రదించారు. కాగా మంగళవారం తిరువూరులో నగర పంచాయతీల కమిషనర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రాజేంద్రప్రసాద్ పెడన మునిసిపల్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటుండగా ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement