కొండపై నుంచి దొర్లిన బండరాయి | A stone slab fall from hill | Sakshi
Sakshi News home page

కొండపై నుంచి దొర్లిన బండరాయి

Jun 21 2015 2:08 AM | Updated on Sep 3 2017 4:04 AM

కొండపై నుంచి దొర్లిన బండరాయి

కొండపై నుంచి దొర్లిన బండరాయి

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కిలేశపురం కొండపై నుండి బండరాయి దొర్లింది...

కిలేశపురం(ఇబ్రహీంపట్నం) : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కిలేశపురం కొండపై నుండి బండరాయి దొర్లింది. ఓ ఇంటి సమీపంలోకి వచ్చి నిలిచి పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండపైన అనేక మంది పేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. సుమారు 80 టన్ను ల బరువు ఉండే రాయి ఇళ్లపై పడిఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పింది. సమాచారాన్ని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు అందజేశారు.

అక్కడకు చేరుకున్న ఇబ్రహీంపట్నం స్టేషన్  సీఐ జె.మురళీకృష్ణ, కార్యదర్శి కె.సురేష్‌బాబు, వీఆర్‌వో లలితకుమారి దొర్లిన బండరాయిని పరి శీలించారు. సమీపంలోని నివాస గృహా ల సభ్యుల ను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వర్షం తగ్గుముఖం పట్టాక రాయిని తొలి చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

నివాసగృహాలకు సమీపంలో క్వారీ నిర్వహిస్తున్నారు. క్వారీలో పేలుళ్లస్థాయి అధికంగా ఉన్నందునే అనేక సార్లు కొండరాళ్లు దొర్లి ఇళ్లసమీపంలోకి వచ్చిపడ్డాయిని  స్థానికులు తెలిపారు. గతంలో పేలుళ్ల దాటికి కదిలిన కొండరాళ్లు వర్షానికి మట్టి నా నటంతో కిందకు జారాయని  ఆరోపిస్తున్నారు. స్థానికులను వేరే ప్రాంతానికి తరలించటంలో టీడీపీ మండలఅధ్యక్షుడు ఆర్.రాజశేఖర్, గ్రామ నేతలు గౌర్నేని పిచ్చేశ్వరరావు, నరశింహస్వామి, ఏ రాజేశ్వరరావు, వార్డు సభ్యులు సహకారాన్ని అందజేశారు.
 
నగరంలో..:గుణదల : గత మూడురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గుణదల ప్రాంతాలలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మూడో డివిజన్ పరిధిలోని గంగిరెద్దుల దిబ్బ కొండప్రాంతంలో కొండచరియ విరిగిపడి ఒక ఇంటిగోడ కూలింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో దుర్గా అనే మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మూడో డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.  ఇటువంటి ప్రమాదాలను నియంత్రించేందుకు  చర్యలు చేపడతామని ఎమ్మెల్యే  చెప్పారు.
 
సున్నపుబట్టీల సెంటర్‌లో
మెగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్ సమీపంలో కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ కారణంగా స్థానిక ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒకేరోజు రెండు ప్రదేశాలలో ఇటువంటి సంఘటనలు జరగడంతో కొండప్రాంత వాసులు ఆందోళనలు చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement