హోర్డింగ్‌ మీద పడి యువతి మృతి | a lady dies while hording falls on ​her body | Sakshi
Sakshi News home page

​కాకినాడలో హోర్డింగ్‌ బీభత్సం...

Jun 2 2017 5:32 PM | Updated on Sep 5 2017 12:40 PM

కాకినాడలో హోర్డింగ్‌ కూలి పడి యువతి మరణించడంతో నగరంలోవిషాదం నెలకొంది.

తూర్పుగోదావరి: కాకినాడలో హోర్డింగ్‌ కూలి పడి యువతి మరణించడంతో నగరంలోవిషాదం నెలకొంది. ఎస్‌ఆర్‌కే సెంటర్ జ్యోతుల మార్కెట్ వద్ద గల షాపింగ్ మాల్ పై  ఉన్న హోర్డింగ్‌ హఠాత్తుగా కూలి అటుగా వస్తున్న యువతిపై పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. మృతురాలు కాకినాడ గ్రామీణం మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శాంతి (20)గా గుర్తించారు. మూడో టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement