ఇంట్లో ఎవరు లేనిది చూసి దొంగలు రెచ్చిపోయారు
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విజయవాడకు సమీపంలోని పెనమలూరు మండలం పోరంకి గ్రామపంచాయతి పరిధిలోని నారాయణపురం కాలనీలో జరిగింది. ఈ కాలనీలోని పెందుర్తి వరప్రసాద్ మూడు రోజుల క్రితం బ్యాంక్ పనిమీద ఊరికెళ్లారు.
ఇంట్లో వరూ లేని సమయంలో దొంగలు ప్రసాద్ మేనల్లుడి పెళ్లికోసం తెచ్చిన 20 కాసుల బంగారంతో పాటు ఇంట్లో ఉన్న 50 కాసుల బంగారం, 12 కిలోల వెండి తోపాటు 90 వేల రూపాయల నగదు దోచేశారు. గురువారం ఉదయం పనిమనిషి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో యజమనికి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తూర్పు డివిజన్ ఏసీపీ మహేశ్వర్ రాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనానికి గురైన సొమ్ము సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపారు.