ప్రజావ్యతిరేకపాలన: ఉమ్మారెడ్డి | 92 percent of farmers cultivation on debts | Sakshi
Sakshi News home page

ప్రజావ్యతిరేకపాలన: ఉమ్మారెడ్డి

Nov 29 2014 6:48 PM | Updated on Oct 1 2018 2:03 PM

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - Sakshi

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 92 శాతం మంది రైతులు అప్పులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారని చెప్పారు. బడ్జెట్లో 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏం సరిపోతుందని ఆయన అడిగారు.చంద్రబాబు మోసపూరిత హామీలు, ప్రజావ్యతిరేక విధానాలతో సాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా డిసెంబరు 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సాగి ప్రసాద రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్, జిల్లా ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, గిద్ది ఈశ్వరి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement