ఎనిమిదోవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో సోమవారం చోటుచేసుకుంది. హాస్టల్ రూం నుంచి విద్యార్థిని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
దాంతో హాస్టల్ యాజమాన్యం హాస్టల్ రూం తలుపు పగలగొట్టారు. ఊరేసుకుని కనిపించిన విద్యార్థిని మృతదేహాన్ని చూసి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని బీహార్కు చెందిన కీర్తికుమారిగా గుర్తించారు. అయితే కీర్తి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.