కోడి పందాల్లో కొట్లాట.. 8 మందికి కత్తి పోట్లు | 8 people injured, two groups quarrelled themselves during Cock fights | Sakshi
Sakshi News home page

కోడి పందాల్లో కొట్లాట.. 8 మందికి కత్తి పోట్లు

Jan 16 2015 8:50 PM | Updated on Sep 2 2017 7:46 PM

కొవ్వాడలో కోడి పందాల స్థావరం వద్ద శుక్రవారం ఉదయం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మండలం కొవ్వాడలో కోడి పందాల స్థావరం వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొవ్వాడలో కోడి పందాల స్థావరం వద్ద శుక్రవారం ఉదయం అనిల్‌కుమార్‌తో భీమ్ సింగ్, షేర్ సింగ్ ఘర్షణ పడ్డారు.

ఈ దాడిలో అనిల్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురు కత్తి పోట్లకు గురయ్యారు. గాయపడ్డవారిని  స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement