పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని దుండగులు కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తాడేపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.
గుంటూరు: పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని దుండగులు కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తాడేపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బ్రహ్మానందపురానికి చెందిన దామవరపు కిషోర్‌కుమార్ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం స్నేహితులతో పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పల్సర్ వాహనం పై వచ్చి కిషోర్‌కుమార్‌ను అపహరించుకు వెళ్లారు.
ఇది గమనించిన ఇతర విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో పాటు వారిని వెంబడించి... పట్టుకోవడానికి ప్రయత్నించారు. దాంతో భయపడిన దుండగులు బాబును వదిలి పరారయ్యారు. స్కూల్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే కిషోర్ తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.