అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది.
గుంటూరు: అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది. ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నివాస సదుపాయం కల్పించనుంది.
సచివాలయ మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్క్లో నివాస సదుపాయాలు కల్పించనుంది. వసతి సదుపాయం కావలసిన మహిళా ఉద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.