ప్రమాదవశాత్తూ గోదావరిలో జారి పడి ఇనుపాల భవితేజ(5) అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన దేవీపట్నం మండలం వీరవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది.
తూర్పుగోదావరి (దేవీపట్నం) : ప్రమాదవశాత్తూ గోదావరిలో జారి పడి ఇనుపాల భవితేజ(5) అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన దేవీపట్నం మండలం వీరవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు సుమారు 3 కి.మీల దూరం కొట్టుకుపోయాడు. పోశమ్మ గండి వద్ద బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.