డిగ్రీ పరీక్షల్లో నలుగురి డిబార్ | 4 members dibar in degree final exams | Sakshi
Sakshi News home page

డిగ్రీ పరీక్షల్లో నలుగురి డిబార్

Nov 5 2013 6:38 AM | Updated on Sep 2 2017 12:18 AM

వీఎస్‌యూ పరిధిలో సోమవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. నగరంలో డీకే ప్రభుత్వ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న డిగ్రీ తృతీయ సంవత్సర పరీక్షల్లో ఒకరు, సర్వోదయ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రథమ సంవత్సర పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి డిబార్ చేశారు.

 నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: వీఎస్‌యూ పరిధిలో సోమవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. నగరంలో డీకే ప్రభుత్వ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న డిగ్రీ తృతీయ సంవత్సర పరీక్షల్లో ఒకరు, సర్వోదయ కళాశాల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రథమ సంవత్సర పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించి డిబార్ చేశారు. తృతీయ సంవత్సర పరీక్షల్లో 366 మందికి 270 మంది, ప్రథమ సంవత్సర పరీక్షలకు 722 మందికి 551 మంది హాజరయ్యారు.
 
 ముగిసిన ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ పరీక్షలు
 వీఎస్‌యూ పరిధిలో నిర్వహిస్తున్న ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఎంసీఏ పరీక్షలకు 290 మందికి 232 మంది, ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు 251 మందికి 182 మంది హాజరయ్యారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement