ఆటో బోల్తా: నలుగురికి గాయాలు | 4 injured in auto accident at guntur distirict | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

Aug 11 2015 9:35 AM | Updated on Mar 9 2019 4:28 PM

ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలయ్యాయి.

గుంటూరు(ప్రత్తిపాడు): ఓ ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. చీరాల నుంచి గుంటూరుకు వెళుతున్న ఆటో ప్రత్తిపాడు వద్ద రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. బాధితులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement