పిడుగుపాటుకు 36 మేకలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకింగుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.
విజయనగరం: పిడుగుపాటుకు 36 మేకలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకింగుర గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. ఇదే మండలం బుసాయివలస గ్రామానికి చెందిన రైతు కొయ్యన సోములు తనకున్న మేకలతో మేతకోసం బయలుదేరాడు. ఈ సమయంలో పిడుగు పడటంతో మేకలన్నీ మృతిచెందాయి. జీవనోపాధి కోల్పోవడంతో రైతు బోరున విలపించాడని సమాచారం.
(రామభద్రాపురం)