ఎంసెట్ కౌన్సిలింగ్‌కు మరో 3 కేంద్రాలు | 3 New Centres for EAMCET | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సిలింగ్‌కు మరో 3 కేంద్రాలు

Aug 20 2013 9:02 PM | Updated on Sep 1 2017 9:56 PM

ఎంసెట్ కౌన్సిలింగ్‌కు కొత్తగా 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.

హైదరాబాద్: ఎంసెట్ కౌన్సిలింగ్‌కు కొత్తగా 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు  ఉన్నత విద్యా మండలి తెలిపింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (శ్రీకాకుళం), జేఎన్‌టీయూ (విజయనగరం), గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్‌ (ఒంగోలు) లలో  కేంద్రాలు ఏర్పాటు
చేస్తారు. ఆప్షన్లు ఇవ్వలేకపోయిన విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని మండలి తెలిపింది.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన  తర్వాతే సీట్ల కేటాయింపు జరుగుతుందని మండలి పేర్కొంది. అవకాశం కోల్పోయిన విద్యార్థులకు మరోసారి షెడ్యూల్‌ విడుదల చేస్తామని   ఉన్నత విద్యా మండలి తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్రలో కౌన్సిలింగ్కు చాలా మంది విద్యార్థులు హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement